Dear Visitor,
Dear visitor, welcome to our website! The hectic daily routine of ours makes us run with time. We hustle to provide for ourselves and our families. Irrespective of our economic status, we often struggle to meet our ends. There is constant competition for improvement in every sphere of our lives. Amidst all this, we cannot help but realize the harsh realities of our collective future as humanity and of our beautiful home Earth. We could try to ignore this harsh reality, but the grim signs remind us constantly. The depletion of Ozone layer, increase in Carbon emissions, raising of sea levels, changing weather patterns, rising tide of killer earthquakes, famines, wars, and diseases such as Ebola and COVID-19 all these remind us constantly that we are heading for a big crash. Could we with our technology create an artificial layer and cover the holes in the Ozone layer? Could we with our scientific knowledge decrease Carbon emissions, lower sea levels, normalize weather patterns? Could we better predict earthquakes and hurricanes? Could we prevent famines? Could our world political systems put an end to wars and bring peace? Could our scientists wipe Ebola and COVID-19 off this planet?
Is there any scientific, technological, medical, or political solution to these problems surrounding humans at present? In all humility, we must admit that there is no credible solution for all these problems.
Fortunately, God didn’t leave us in the dark. What does the Bible say about these things? Are there any Bible prophecies that tell us how the future of humanity and Earth would be like? It is my burden to share the light of the Biblical prophecies regarding our human race and our planet earth with you. In this website you will find my videos and posts of Biblical end time prophecies. I hope you be blessed by listening and reading these prophecies.
Dr. N. Sharath Babu
ప్రియ సత్యాన్వేసకులకు ,
మా వెబ్ సైట్ కు మీకు సుస్వాగతం,మన తీరికలేని అనుదిన పని ఒత్తిళ్ళు మనలను సమయంతో సమానంగా పరుగెత్తే పరిస్తితుల్లో జీవిస్తున్నాము. మన ఆర్ధిక సామాజిక పరిస్తితులు ఎలా వున్నను మన అవసరాలు తీరుటకు ఎంతటి వారికైనా శ్రమించటం అత్యవసరముగా ఉన్నది. ప్రతి పనిలో ఉన్నత ప్రమాణాలు సాధించే సాధన ప్రతి వారికి ఒక సవాలుగా మారిన దినములలో ఉన్నాము. ఇట్టి పరిస్తితులలో కూడా మన భవిష్యత్తు, మానవ మనుగడ ప్రమాద స్తితికి చేరిన సంకేతాలు మన కళ్ళముందే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్తితుల్లో ఉన్నాయి. ఉదా. రోజు రోజుకు కరిగి పోతూ, తరిగి పోతున్న ఓజోను పొర! ఈ ఓజోను రంద్రాలను పూడ్చగల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమేదైన ఉన్నదా? అతి తరచుగా వస్తున్న భూకంపాలను ముందే పసిగట్టి మనలను హెచ్చరించగల విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? అతి తరచుగా వస్తున్న తుఫానులూ , వరదలను నియంత్రించి, ఆపగల శక్తి ఏ మానవుని కైనా కలదా? ఇటీవల మానవులను వణికిస్తున్న ఎబోలా, కోవిద్-19 వంటి రోగాలు మానవవాళిని పూర్తిగా మట్టుపెట్టే పరిస్తితులు మనకు తేట తెల్లంగా కనిపిస్తున్నాయా? ఈ ప్రకృతి వైపరీత్యాలను, ఈ భయంకరమైన రోగాలను అంతమొందించి, సమస్త జీవ రాశులను రక్షించగల శక్తి , నైపుణ్యము ఏ నాయకునికైనా, శాస్త్రవేత్త కైనా, మత పెద్దలకైనా సాధ్యమా? మనము ఒక వాస్తవాన్ని అంగీకరించాలి, అది ఏ మానవునికీ సాధ్యము కాదు.
దేవుడు ప్రేమగల వాడు, మానవులు నశించుట ఆయనకు ఇష్టము కాదు కనుక పైన ప్రస్తావించిన భయంకర సంఘటనలను గూర్చి బైబిలు గ్రంధములో త్వరలో జరగబోవు విషయాలు ప్రవచనాల రూపంలో ఆ ప్రేమగల దేవుడు మన కొరకు ప్రవక్తలతో వ్రాయించారు. వాటిని మీతో పంచుకోవాలనే భారంతో ఈ వెబ్ సైట్ లో నేను మీకోసం వీడియోలు, వ్యాసాలు ఉచితముగా అందుబాటులో ఉంచుతున్నాను. వీటి ద్వారా మీరు దీవించబడాలని, రక్షించబడాలని నా ఆశ, నా హృదయ పూర్వక ప్రార్ధన.
ఇట్లు
ప్రభు సేవలో మీ సహోదరుడు,
డాక్టర్ న. శరత్ బాబు